70 కోట్ల ల్యాండ్‌ కొట్టేద్దామనుకున్రు

70 కోట్ల ల్యాండ్‌ కొట్టేద్దామనుకున్రు

పెద్దల అండతో భూముల దందా
కీసర తహసీల్దార్‌‌ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన ఏసీబీ

హైదరాబాద్‌, వెలుగు: మేడ్చల్‌ జిల్లా కీసర తహసీల్దార్‌ ‌నాగరాజు అవినీతి కేసులో ఏసీబీ దర్యాప్తులో స్పీడ్ పెంచింది. కీసర మండలం రాంపల్లి దయారాలో 53 ఎకరాల భూ కుంభకోణం వెనక ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పెద్దల వివరాలను ఏసీబీ అధికారులు రాబడుతున్నారు. శుక్రవారం రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాగరాజుతో పాటు వీఆర్‌‌ఏ బొంగు సాయిరాజ్‌, సత్య డెవలపర్స్‌ శ్రీనాథ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కందాడి అంజిరెడ్డిని శనివారం ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. శుక్రవారం రాత్రి నుంచి ఆల్వాల్‌లోని నాగరాజు, వీఆర్‌‌ఏ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపింది. శనివారం జరిపిన సెర్చెస్‌లో తహసీల్దార్‌‌ నాగరాజు కారులో నుంచి రూ.8 లక్షల క్యాష్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు ఇంట్లో రూ.28 లక్షల క్యాష్ , అరకిలో బంగారు నగలు, లాకర్‌‌కీని ఏసీబీ స్వాధీనం చేసుకుంది. కందాడి అంజిరెడ్డి ఇంట్లో ఓ కీలక ఎంపీకి చెందిన ఎంపీ లాడ్స్ లెటర్ కూడా దొరికినట్లు తెలిసింది. కీసర మండల ఆఫీస్‌లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. డిప్యూటీ తహసీల్దార్‌‌ ప్రసన్న, ఆర్‌‌ఐ శశికళను ఏసీబీ అధికారులు విచారించారు.

తప్పుడు పాస్‌బుక్స్‌ క్రియేట్‌ చేసేందుకు ప్లాన్‌..
సర్వే నంబర్‌‌ 614తో పాటు ఇతర సర్వే నంబర్లలోని 19 ఎకరాల 39 గుంటల పట్టాదార్‌ ‌పాస్‌బుక్స్ ను సత్య డెవలపర్స్ పేరుతో క్రియేట్‌ చేసేందుకు తహసీల్దార్‌‌ రూ.2 కోట్లు డిమాండ్‌ చేశాడు. శుక్రవారం రాత్రి రూ.1.10 కోట్లు లంచం ఇస్తుండగా సత్య డెవలపర్స్‌ కు చెందిన చౌలా శ్రీనాథ్ యాదవ్‌, రాంపల్లి దయారాకు చెందిన కందాడి అంజిరెడ్డి, వీఆర్ఏ బొంగు సాయిరాజును ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

సమగ్ర విచారణ జరిపించాలె
2018లో 5.7 గుంటల ల్యాండ్ తీసుకున్నాను. మ్యుటేషన్‌ కోసం నాగరాజు నన్ను ఇబ్బంది పెట్టాడు. గతేడాది ఇక్బాల్‌, సలీంలతో కలిసి నా ల్యాండ్‌ కబ్జా చేద్దామనుకున్నారు. మా భూమిలో కాంపౌండ్‌ వాల్‌, గెస్ట్ హౌజ్‌ను కూల్చివేశారు. దీనిపై అప్పటి మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి , జేసీ శ్రీనివాస్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. – సురేందర్ రెడ్డి, మాజీ ఏసీపీ

For More News..

నీటి విషయంలో రాజీపడం

ఎన్జీటీ తీర్పు ఇచ్చే టైమ్లో.. సర్కార్ మేల్కొంది