అసమ్మతి గళాలను కేంద్రం అణచాలని చూస్తోంది

అసమ్మతి గళాలను కేంద్రం అణచాలని చూస్తోంది

న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన పర్యారణ కార్యకర్త దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. అసమ్మతి గళాలను అణచాలని చూస్తున్నారని ఆరోపించారు. గన్స్ పట్టుకుని తిరిగేవాళ్లు నిరాయుధురాలైన అమ్మాయికి భయపడుతున్నారని బీజేపీ సర్కార్‌పై ప్రియాంక ఫైర్ అయ్యారు.

దిశా రవి అరెస్టును కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ఖండించారు. నిజం ఎప్పుడూ బతికే ఉంటుందని, వాళ్లు భయపడ్డారు కానీ దేశం కాదని కేంద్రాన్ని ఉద్దేశించి రాహుల్ కామెంట్ చేశారు. దేశం నిశ్శబ్దంగా ఉండబోదని ట్వీట్ చేశారు. కాగా, కొత్త అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ సోషల్‌ మీడియాలో ఓ టూల్ కిట్‌‌ను షేర్ చేశారని సమాచారం. ఈ టూల్ కిట్‌‌ను దిశా రవి అప్‌లోడ్‌ చేశారన్నది ఆమెపై వచ్చిన ఆరోపణ. ఈ టూల్‌కిట్‌ రైతులను రెచ్చగొట్టేలా ఉందని పేర్కొంటూ దిశా రవిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద పోలీసులు కేసులు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.