బదిలీ అయిన టీచర్ల బిల్లులు తీసుకోవాలె.. ట్రెజరీ డైరెక్టర్​కు తపస్ వినతి

బదిలీ అయిన టీచర్ల బిల్లులు తీసుకోవాలె..  ట్రెజరీ డైరెక్టర్​కు తపస్ వినతి
  • బదిలీ అయిన టీచర్ల బిల్లులు తీసుకోవాలె    
  • ట్రెజరీ డైరెక్టర్​కు తపస్ వినతి 

హైదరాబాద్, వెలుగు : ఇటీవల బదిలీ అయిన, ప్రమోషన్లు పొందిన టీచర్ల బిల్లులను, రెగ్యులర్ బిల్లులతో పాటు ఈ నెల31 వరకూ తీసుకోవాలని  ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, కార్యదర్శి నవాత్ సురేశ్  కోరారు. మంగళవారం స్టేట్ ట్రైజరీ డైరెక్టర్ రామచంద్రమూర్తికి ఆ సంఘం రాష్ట్ర నేతలు పెంటయ్య, కాశీ రావుతో కలిసి వినతిపత్రం అందించారు. 

జీవో 317 మాదిరిగానే పాత, కొత్త స్కూళ్ల వేతనాలు కూడా ఒకేసారి అనుమతించేలా సాఫ్ట్ వేర్ ను మార్చాలని డైరెక్టర్​ను కోరారు. కాగా, టీచర్ల వేతన బిల్లులు ఈ నెల 31 వరకూ తీసుకుంటామని రామచంద్రమూర్తి హామీ ఇచ్చినట్లు తపస్ పేర్కొంది.