
‘బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్నీ సత్య దాదా వైపు తిరిగాయి’ అనే డైలాగ్‌తో మొదలైన ‘ఓజీ’ ట్రైలర్‌ను కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చూపించారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఒకప్పుడు బాంబేలో ఊచకోత కోసిన ఓజాస్ గంభీర కొన్ని కారణాలతో అజ్ఞాతంలోకి వెళ్లి ఫ్యామిలీతో ఉండడం, ఆ తరువాత మళ్ళీ అతని కోసం శత్రువులు మాఫియా సామ్రాజ్యం ఎదురుచూడడం సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఈ నేపథ్యంలో ‘బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త’ అని పవన్ చెప్పే డైలాగ్ అంచనాలు పెంచింది. ఓజాస్ చేతిలో కత్తి, విలన్స్‌ను ఊచకోత కోసే సీన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ పాత్రల మధ్య జరిగే పోరాటం ఉత్కంఠను రేపేలా ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. OG సినిమా ట్రైలర్ చూశాక అభిమానుల్లో అయితే ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.
ఫుల్ వయలెన్స్ ఉందని సెన్సార్ బోర్డ్ ఇచ్చిన ‘A’ సర్టిఫికేషన్తో తేలిపోయింది. కచ్చితంగా ఈ అంశం అభిమానులకు పూనకాలు తెప్పించే విషయమనే చెప్పాలి. ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉందని ట్రైలర్ చూశాక అర్థమైంది. అయితే.. ఈ భావోద్వేగాలు కామన్ ఆడియన్స్కు కనెక్ట్ అయితే ఎంత వయలెన్స్ ఉన్నా సినిమా హిట్ అవడం ఖాయం. భావోద్వేగాలు కనెక్ట్ కాకపోతే మితిమీరిన హింస ఉందనే అభిప్రాయం సగటు ప్రేక్షకులలో వ్యక్తమయ్యే అవకాశం ఉంది.