టెల్అవీవ్: ఇరాన్ మొదటిసారిగా దీర్ఘశ్రేణి మిసైల్స్‌ను ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. పశ్చిమాసియాను దాటి ఇరాన్ దాడులు చేయడం ప్రారంభించిందని ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ ఆయాల్ జమీర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లాంగ్ రేంజ్ మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడి చేసే ఉద్దేశం ఇరాన్‌కు లేకపోయినా.. వాటి స్థాయి బెర్లిన్, పారిస్, రోమ్ వంటి యురోపియన్ నగరాలకు చేరేంత ఉందని చెప్పారు.
కాగా.. హిందూ మహాసముద్రంలోని యూఎస్, యూకే మిలటరీ బేస్ డియాగో గార్సియాను లక్ష్యంగా చేసుకుంటూ 4 వేల కిలోమీటర్ల స్థాయి ఉన్న రెండు బాలిస్టిక్ మిసైళ్లను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ మిసైల్ సైట్లపై దాడులు చేయడానికి బ్రిటిష్ మిలిటరీ బేస్‌ను అమెరికా వాడుకునేందుకు అనుమతిచ్చే ముందే ఇరాన్ ఆ క్షిపణులను ప్రయోగించిందని బ్రిటన్ రక్షణ శాఖ పేర్కొంది.
