చాలామందికి నాన్ వెజ్ మాట వింటే చాలు, వెంటనే తినాలనిపిస్తుంది. ఇక నదులు, చెరువుల దగ్గర ఉండే వాళ్లకైతే ఎనీ టైం సీ ఫుడ్ తినే వీలుంటుంది. మామూలుగా వారానికి ఒకటి రెండుసార్లు నాన్ వెజ్ తినేవాళ్లు కాస్తా వాగులు, వంకల దగ్గర ఇళ్లున్న వాళ్లు కచ్చితంగా వారానికి నాలుగైదు సార్లు ఏదోరకంగా చేపల్లాంటివి తినడానికి అలవాటు పడతారు. కానీ... ఈ గ్రామాల్లో ఉండే వాళ్లు మాత్రం అలాంటి ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు. ‘వాళ్లకి సీ ఫుడ్ ఎక్కువగా దొరకదేమోలే’ అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వాళ్లు ఉండేది సముద్ర తీరానే. వాళ్లు చేసే పని కూడా చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిని పట్టి అమ్ముకోవడమే. మరెందుకు తినరు?
నూటికి తొంభైమంది నాన్ వెజ్ ప్రియులుంటే, మిగతా పది శాతం వెజిటేరియన్లే కదా. నాన్ వెజ్ ప్రియుల్లోనూ చికెన్, మటన్, సీ ఫుడ్ ఇలా మొత్తం నాన్‌వెజ్ ఐటమ్స్ తినేవాళ్లు తక్కువే. ఎందుకంటే ఎవరికి నచ్చిన ఐటెమ్ వాళ్లు తింటారు. కాబట్టి మూడూ తినకపోయినా ఏదో ఒకటి ఇష్టంగా తింటారు. అయితే... కెన్యాలోని మొంబాసా సిటీకి దగ్గర్లో ఉన్న కిలిఫీ సముద్రంలో ప్యారెట్ ఫిష్, ఆక్టోపస్, వంటి కొన్ని రకాల సీ యానిమల్స్ దొరుకుతాయి. వాటిని పట్టుకుని, అమ్ముకోవడమే ఆ తీర ప్రాంతాల వాళ్ల వృత్తి. కానీ... వాళ్లు మాత్రం వాటిని తినరు. ఎందుకు? అంటే... ‘‘చేపలు తినడం కన్నా, అమ్ముకుంటే మాకు డబ్బులొస్తాయి. అప్పుడు మేం ఫైనాన్షియల్‌గా బాగుంటాం” అంటారు. అయితే దీనివల్ల వాళ్ల పిల్లల్లో ఎదుగుదల తగ్గుతోందట. పోయినేడాది రికార్డుల ప్రకారం అక్కడ సగం మంది పిల్లల్లో ఎదుగుదల జాతీయ రేటు కంటే రెండింతలు తగ్గిందట.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ లోరా ఇయాన్నోటి (వాషింగ్టన్‌కి చెందిన). తన టీమ్‌తో కలిసి ఒక ఎక్స్పరిమెంట్ చేసింది. అదేంటంటే, ఆ గ్రామాల వాళ్లకు చిన్న చేపలు తప్పించుకునే విధంగా ఉన్న వలలు ఇచ్చారు. దానివల్ల చేపల సంతతి పెరుగుతుంది. వాళ్ల ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతోపాటు వాళ్ల ఇళ్లకు వెళ్లి సీ ఫుడ్ తినడం వల్ల కలిగే లాభాల గురించి చెప్పారు. అలా చాలా ఫ్యామిలీలను సీ ఫుడ్ తినేలా ఎంకరేజ్ చేసింది. అందులోనూ వాళ్లకు ఎక్కువగా దొరికే లోకల్ స్పీసిస్ ‘టాఫీ’ చేప, ఆక్టోపస్ తినేవాళ్లు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల గ్రోత్ ఇంతకు ముందు కంటే బాగుందని తెలిసింది. ఈ ఎక్స్పరిమెంట్ లక్ష్యం కూడా అదే. సీ ఫుడ్ హెల్త్‌కి చాలా మంచిది. పైగా అది డబ్బులుపెట్టకుండానే దొరుకుతుంది. కాబట్టి వాటిని తినాలి అంటోంది లోరా.
