బాల రామయ్యకు బట్టలు కుడుతుంది వీళ్లే..

బాల రామయ్యకు బట్టలు కుడుతుంది  వీళ్లే..

అయోధ్యలో ఓ చిన్న టైలర్‌‌‌‌ దుకాణం బాబూ లాల్‌‌‌‌ టైలర్స్‌‌‌‌. దీన్ని  ఇద్దరు అన్నదమ్ములు భగవత్‌‌‌‌, శంకర్‌‌‌‌ లాల్‌‌‌‌ నడుపుతున్నారు. వీళ్లే బాల రామయ్యకు బట్టలు కుడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్‌‌‌‌దాస్‌‌‌‌ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్‌‌‌‌, శంకర్‌‌‌‌‌‌‌‌ల తండ్రి బాబూలాల్‌‌‌‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్ర్తాలు కుడుతోంది.  రామ్ లల్లా ఒక్కో రోజు వస్త్రధారణకు ఒక్కో రంగు వస్త్రాలు కుట్టిస్తారు వీళ్లు.

సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం రంగు వస్త్రాలు వేస్తారు. రామ్ లల్లాకు మాత్రమే కాదు.. సోదరులు లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమాన్, శాలిగ్రామాలకు కూడా బట్టలు కుట్టారు. ఈ టైలర్లు అయోధ్యలోని బడి కుటియా ప్రాంతంలో శ్రీ బాబులాల్ టైలర్ పేరుతో ఎనిమిది అడుగుల గదిలో దుకాణం నడుపుతున్నారు.