కాచిగూడ ఏటీఎంలో చోరీకి దొంగ విఫల యత్నం

కాచిగూడ ఏటీఎంలో చోరీకి దొంగ విఫల యత్నం

బషీర్​బాగ్, వెలుగు: ఏటీఎం మెషీన్​లో డబ్బులు కాజేసేందుకు ఓ దొంగ ప్రయత్నించి విఫలమయ్యాడు. కాచిగూడ సీఐ జ్యోత్స్న తెలిపిన ప్రకారం.. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్ పురా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ పక్కన ఉన్న రాజధాని కో-ఆపరేటివ్ బ్యాంకు ఏటీఎంలోకి బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఓ దొంగ ప్రవేశించాడు.

తన వెంట ఇనుప వస్తువులతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. సెంట్రల్ లాక్ సిస్టం కావడంతో ఏటీఎం నుంచి డబ్బులు రాలేదు. దీంతో ఆ దొంగ వెనుదిరిగాడు. దొంగ తాగి తూలుతున్నట్లుగా సీసీ ఫుటేజీలో కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.