రైళ్లలో వరుస చోరీలు..భయాందోళనలో ప్రయాణికులు

రైళ్లలో  వరుస చోరీలు..భయాందోళనలో ప్రయాణికులు

బషీర్​బాగ్, వెలుగు: కాచిగూడ రైల్వే స్టేషన్​లో రైలు దిగుతున్న ప్రయాణికుడి నుంచి మొబైల్​ను లాక్కొని దొంగ పరారయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మహాదేవ్ గుంగు(37) షాద్ నగర్ లో కాచిగూడ–గుంటూరు రైలు ఎక్కాడు. బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగుతుండగా ఈ సంఘటన జరిగింది. మరో ఘటనలో సర్టిఫికెట్లు ఉన్న బ్యాగ్​ను దొంగలు ఎత్తుకెళ్లారు. 

ఆసిఫాబాద్​కు చెందిన సానిత్ కుమార్(25) మహారాష్ట్రలోని నాందేడ్ లో రైలు ఎక్కాడు. ఉమ్రి స్టేషన్​వద్ద అతని బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. తిరుమలగిరికి చెందిన జోహార్ రంగు నాలా(48) తన భార్యతో కలిసి వడోదరలో కాచిగూడకు రావడానికి రైలు ఎక్కారు. నిజామాబాద్ వద్ద అతని భార్య హ్యాండ్ బ్యాగు దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ బ్యాగులో ఐదు గ్రాముల బంగారు రింగు, రూ.4 వేల నగదు ఉన్నట్లు బాధితుడు తెలిపారు. 

ఈ ఘటనపై బాధితుల ఇచ్చిన ఫిర్యాదుతో కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.