ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్లాన్.. గ్యాస్ కట్టర్లతో మెషిన్ ధ్వంసం.. చివరికి ఏమైందంటే.. ?

ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్లాన్.. గ్యాస్ కట్టర్లతో మెషిన్ ధ్వంసం.. చివరికి ఏమైందంటే.. ?

నిజామాబాద్ జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ఎస్బీఐ ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేశారు దుండగులు. బుధవారం ( ఆగస్టు 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ లోని ఓ ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి వ్యాన్ లో వచ్చారు మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ముఠా సభ్యులు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేశారు దుండగులు.ఈ క్రమంలో రూ. 5 లక్షలకు పైగా నగదు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.

ఘటన జరిగిన సమయంలో ఏటీఎంలో రూ. 25 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. గ్యాస్ కట్టర్లతో మెషిన్ ను ధ్వంసం చేయడంతో ఏటీఎంలోని కొంత నగదు కాలిపోయినట్లు తెలుస్తోంది. చోరీ జరుగుతున్న సమయంలో పెట్రోలింగ్ వాహనం రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

ALSO READ : ఇంటర్నెట్, కేబుల్ వైర్లను కట్ చేయొద్దని నిర్ణయం

దుండగులను పట్టుకోవడానికి పోలీసులు సుమారు 18 కిలోమీటర్ల పాటు చేజ్ చేసినట్లు తెలిపారు. దుండగులు వ్యాన్ పొలాల్లో వదిలేసి వెళ్లినట్లు సమాచారం. చోరీకి యత్నించిన దుండగులు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించామని తెలిపారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులు కోసం గాలిస్తున్నామని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.