మన్సూరాబాద్ అయ్యప్ప దేవాలయంలో చోరీ.. కత్తులతో బెదిరించి పరార్

మన్సూరాబాద్ అయ్యప్ప దేవాలయంలో చోరీ.. కత్తులతో బెదిరించి పరార్

ఎల్బీనగర్/హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో దొంగల దోపిడీ యత్నాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అయ్యప్ప స్వామి దేవాలయంలో చోరీకి ప్రయత్నించారు దుండగులు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని దొంగిలించి బైక్ పై వెళ్తుండగా ఇద్దరు వాహనదారులు అడ్డుకున్నారు. దీంతో వారిని కత్తులతో బెదిరించే ప్రయత్నం చేశారు. స్థానికులు కేకలు వేస్తూ కర్రలతో తిరగబడటంతో దుండగులు అక్కడి నుండి పారిపోయారు. 


ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడిషనల్ డిసిపి కోటేశ్వర రావు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.