
చేర్యాల, వెలుగు : ఆర్మీ ఉద్యోగం రాలేదని పురుగుల మందు తాగిన యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని కూటిగల్గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ షేక్ యూనస్అహ్మద్అలీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్(21) గత నెలలో హన్మకొండలో జరిగిన ఆర్మీ ర్యాలీలో పాల్గొని సెలక్ట్ అయ్యాడు.
కానీ మెడికల్టెస్ట్లో చేతులు వంకరగా ఉన్నాయని అధికారులు రిజెక్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్ ఈ నెల 16న వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్తరలించగా సోమవారం చికిత్స పొందుతూ చనిపోయాడు. తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.