హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వి.మునిరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటించారు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాత. ఈనెల 17న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మునిరాజు మాట్లాడుతూ ‘దర్శకుడు కావాలనే డ్రీమ్‌తో ఇండస్ట్రీకి వచ్చి ఆన్‌లైన్ ఎడిటర్‌గా వర్క్ చేశాను.
అలా చేస్తూనే ఓ స్క్రిప్ట్ రాసుకుని డెమో షూట్ చేశా. ‘మీటర్’ షూట్ టైమ్‌లో కిరణ్ గారికి ఈ విషయం చెప్పాను. ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. నేను చిన్నప్పటి అనుభవాలే ఈ చిత్రానికి స్ఫూర్తి. ఊర్లో మొదటిసారి టీవీ వచ్చినప్పుడు థియేటరే ఊరికి కదిలొచ్చిందా అనిపించింది. ప్రతి ఊరిలోనూ ఇలాంటి ఫీల్ ఉంటుంది.
ఊరి మనుషులు, వాల్ల ఇగోస్ చుట్టూ జరిగే కథ. మా ఊరు తిమ్మరాజుపల్లి. అక్కడి లొకేషన్స్‌లో రియలెస్టిక్ అప్రోచ్‌తో తీశా. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సీట్ ఎడ్జ్‌లో కూర్చుని చూసే ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ ఫీల్‌తో బయటకు వస్తారు.
నైంటీస్ కిడ్స్‌కు వారి బాల్యాన్ని గుర్తు చేస్తే, ఇప్పటి జనరేషన్‌కు మన కల్చర్‌ను తెలియజేస్తుంది. మేకింగ్ పరంగా సర్ ప్రైజ్ చేస్తుంది. ఆరేడు నిమిషాల సింగిల్ టేక్ సీన్స్ చేశాం. కిరణ్ అబ్బవరం లాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా టీమ్ అందరి అదృష్టం. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని సాధ్యమైనంత సహజంగా తెరకెక్కించడం నాకిష్టం. ఐదారు కథలు సిద్ధం చేసుకున్నా” అని చెప్పాడు.

