రాజ్ తరుణ్ హీరోగా..తిరగబడర సామి

రాజ్ తరుణ్ హీరోగా..తిరగబడర సామి

రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడర సామి’. మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్‌‌ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ని శనివారం విడుదల చేశారు. దర్శకుడు వి.వి.వినాయక్ మోషన్ పోస్టర్‌‌‌‌ని విడుదల చేసి టీమ్‌‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. జెబి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాష్యశ్రీ డైలాగ్ రాస్తున్నారు. మకరంద్ దేశ్‌‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.