
పెర్త్: ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియా మెన్స్ హాకీ టీమ్ వరుసగా మూడో మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 2–1తో ఇండియాపై నెగ్గింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. ఇండియా తరఫున జుగ్రాజ్ సింగ్ (41వ ని.) ఏకైక గోల్ చేయగా, జెరెమీ హేవార్డ్ (44, 49వ ని.) కంగారూలకు రెండు గోల్స్ అందించాడు. ఫస్టాఫ్‌లో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే సెకండాఫ్‌లో షార్ట్ పాస్‌లతో చెలరేగిన ఆసీస్ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.