భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో ఇండియా విమెన్స్ టీమ్ మరోసారి నిరాశ పరిచింది. వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడింది. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3–0తో ఇండియాను చిత్తు చేసింది.
ఆసీస్ తరఫున స్టెవార్ట్ గ్రేస్ (19వ నిమిషం), టాటమ్ (23వ ని), కైట్లిన్ (55వ ని) తలో గోల్ చేశారు. ఇండియా అమ్మాయిలు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయారు. గత రెండు మ్యాచ్‌ల్లో చైనా, నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైన ఆతిథ్య జట్టు శుక్రవారం జరిగే తర్వాతి పోరులో అమెరికాతో పోటీ పడనుంది.
