లోక్‌సభ మూడో దశ ఎన్నికల నోటిషికేషన్‌ విడుదల

లోక్‌సభ మూడో దశ ఎన్నికల నోటిషికేషన్‌ విడుదల

ఎన్నికల సందర్భంగా లోక్‌సభ మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనికి సంబంధించి ఇవాళ (గురువారం) ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్‌ 8. మొత్తం 14 రా ష్ట్రాల్లో 115 నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరగనుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మూడో దశలో గుజరాత్‌లో 26, కేరళలో 20, కర్ణాటక 14, మహారాష్ట్రలో 14, యూపీలో 10, ఛత్తీస్‌ గఢ్‌లో 7, ఒడిశాలో 6, బీహార్‌లో 5, పశ్చిమబెంగాల్‌లో 5, అస్సాంలో 4, గోవాలో 2, జమ్ముకశ్మీర్‌, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీలోని ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటే ఒడిశా అసెంబ్లీకి కూడా పోలింగ్‌ జరగనుంది.

17వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి మే 19 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి.