
ఏపీలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. తిరుమల శ్రీవారి మెట్టు నడకమార్గంలో అనేక ప్రాంతాలో చెట్లు కూలిపోయాయి. వరదకు మెట్లన్నీ కోతకు గురయ్యాయి. దీంతో మెట్ల మార్గం మొత్తం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ముందు జాగ్రత్తతో శ్రీవారి మెట్లను టీటీడీ మూసివేసింది. మరమ్మతులకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల అనుమతికి ఇంకా కొన్ని రోజులు సమయం పట్టేలా ఉంది.