తిరువీర్ ‘పాపం ప్రతాప్’ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్

తిరువీర్ ‘పాపం ప్రతాప్’ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్

తిరువీర్ హీరోగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్ సహకారంతో  రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మదిరెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘పాపం ప్రతాప్’.   ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది.  శనివారం ఈ చిత్రం నుంచి ‘పిల్ల ఎక్కడుంది’ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధాకృష్ణ కంపోజ్ చేసిన మాస్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుద్దాల అశోక్ తేజ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రామ్ మిరియాల ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పాడాడు.

సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘పాటలో చూపించినట్టు  గత సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఇరుగుపొరుగువారు, ఊర్లో వాళ్లు ఎన్నో విధాలుగా నన్ను విమర్శించారు.  ఇప్పటివరకు ‘పాపం ప్రతాప్’ అన్నవాళ్లంతా ఏప్రిల్ 17న ‘వీర ప్రతాప్’ను చూస్తారు’ అని అన్నాడు.

ఈ చిత్రంలో కొత్త  రోల్ చేసే అవకాశం వచ్చిందని నటుడు అవసరాల శ్రీనివాస్ చెప్పాడు.  మగాడి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానం చెప్పేలా ఈ సినిమా ఉంటుందని  డైరెక్టర్ దుర్గా నరేష్ అన్నాడు. ప్రతి ఒక్కరినీ అలరించే చిత్రమిదని నిర్మాతలు రుద్రదేవ్, రాకేష్ అన్నారు.  గతంలో ఆనంద్, గోదావరి, చందమామ లాంటి చిత్రాలకు సంగీతం అందించిన  తాను ఈ సినిమాతో  మంచి కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నట్టు  కేఎం రాధాకృష్ణ  చెప్పారు.  టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిపడా వినోదమే కాదు..  రెట్టింపు ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తామని  ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి చెప్పారు.