యువరాజ్ 6 సిక్సులకు 12 ఏళ్లు

యువరాజ్ 6 సిక్సులకు 12 ఏళ్లు

యువరాజ్ సింగ్ పేరు వింటేనే ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టిన రికార్డు గుర్తుకు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు ఇది. యువరాజ్ ఈ అరుదైన ఫీట్ సాధించి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యింది. ఇదే విషయాన్ని BCCI ట్విట్టర్ ద్వారా గుర్తు చేసింది. ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఒక్కో సిక్సుకు ఒక్కో బ్యాటింగ్ స్టైల్లో యువరాజ్ ఆడిన ఫొటోలను పోస్ట్ చేసింది.

2007 టీ20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఈ అద్భుతం చేశాడు. ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఓవర్లో 6 బాల్స్ లో 6 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పి అదరహో అనిపించాడు.