రైల్లో వెళ్ళేటప్పుడు పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు.. గుర్తుంచుకోండి..!

రైల్లో వెళ్ళేటప్పుడు పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు.. గుర్తుంచుకోండి..!

ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద నెట్ వర్క్ ఇండియన్ రైల్వేస్.. ఇండియాలో రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇంత భారీ వ్యవస్థను నడపడం కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. ఈ క్రమంలో రైళ్లలో ప్రమాదాలు నివారించేందుకు కొన్ని వస్తువులపై నిషేధం విధించింది ఇండియన్ రైల్వేస్. మీరు తరచూ రైల్లో ప్రయాణిస్తుంటారా..? అయితే, రైల్లో వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

గ్యాస్ స్టవ్ లు, పెట్రోల్, డీజిల్, బాణాసంచా, కెమికల్స్, పేలుడు పదార్థాలు వంటివి రైళ్లలోనే కాదు బస్సు, కార్ లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్లడం కూడా ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. అయితే..రైల్లో ప్రయాణించేటప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్లడం నిషేధమని చాలామందికి తెలీదు. అవును నిజమే, రైల్లో ప్రయాణించేటప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్లడంపై నిషేధం విధించింది ఇండియన్ రైల్వేస్.

అగ్ని ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్ల రైళ్లలో ప్రయాణికులు ఎండు కొబ్బరికాయలు తీసుకెళ్లడాన్ని నిషేదించింది ఇండియన్ రైల్వేస్. రైళ్లలో కొబ్బరికాయ ఎందుకు నిషేధించబడిందో, దానికి సంబంధించిన జరిమానాలు వంటి వివరాలు తెలుసుకుందాం.. 

ఇండియన్ రైల్వేస్ లో ఎండు కొబ్బరికాయలు, ముఖ్యంగా పీచుతో ఉన్న కొబ్బరికాయలపై నిషేధం ఉంది. కొబ్బరికాయ వల్ల ఏం ప్రమాదం జరుగుతుందని అందరికీ డౌట్ రావచ్చు కానీ.. కొబ్బరికాయపై ఉండే ఎండిన గడ్డి లాంటి పొట్టు వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ.. వీటి వల్ల ఒక్క చిన్న నిప్పు రవ్వ రగిలినా కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి వీటిని నిషేదించారు. అయితే.. పొట్టు లేని కొబ్బరికాయలు, తాజా కొబ్బరి బొండాలు రైల్లో నిశ్చింతగా తీసుకెళ్లొచ్చు.