పెండ పట్టు.. విసిరికొట్టు..!

 పెండ పట్టు.. విసిరికొట్టు..!

ఎండపూట కావొస్తోంది. ఊర్లో గ్రౌండు చుట్టూ జనం పోగయిన్రు. ట్రాక్టర్ల కొద్దీ ఆవు పేడ తెచ్చిన్రు. నేలమీద గుట్టలుగా పోసిన్రు. ‘‘ఆ.. ఇగ రండయ్యా” అన్నరు. అట్ల పిలిసిన్రో లేదో ఇట్ల పక్కనున్న కొందరు మగవాళ్లు లాగులేసుకొని ఆ పెండలకు దుంకిన్రు. ఇంకొందరు ప్యాంటులు పైకి మలిచి దిగిన్రు. అంతే.. పెండ పట్టుడు.. ఇసిరి కొట్టుడు షురువైంది. కర్నాటక, తమిళనాడు బార్డర్​లోని గుమటపుర ఊర్లో ఏటా దీపావళి తరువాత  జరిగే గొరెహబ్బ పండుగ ఇది. ఈసారి కూడా శనివారం జరిగింది. పోటీలో పాల్గొనేటోళ్లే ఊర్లోని ఇల్లిల్లు తిరిగి ఆవు పెండను గుడి వద్దకు తెస్తరు. పూజ చేశాక గ్రౌండులో వేస్తరు. ఈ పోటీ వల్ల రోగాలు తగ్గుతాయని ఊరి వాళ్లు నమ్ముతరు. నిరుడు కరోనా టైమ్​లోనూ ఈ పోటీకి ఆఫీసర్లు అనుమతిచ్చినా.. వైరస్ భయంతో కొంతమందే ఆట ఆడారు.