‘ఇది పార్లమెంట్, బజార్ కాదు’.. ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం

‘ఇది పార్లమెంట్, బజార్ కాదు’.. ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం

రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వక్తం చేశారు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు. సభలో విపక్ష సభ్యులు నినాదాలతో గందరగోళం సృష్టించడంపై అసహనం వ్యక్తం చేస్తూ… పార్లమెంటు బజార్‌ కాదు అంటూ సభ్యుల తీరుపై మండిపడ్డారు. సభలో ముందు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్.. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ఒక ప్రకటన చేశారు. సభ్యులు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తూ పలు సూచనలు చేశారు. అనంతరం జీరో అవర్‌ చేపడుతున్నట్లు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించగానే విపక్ష నేతలు ఢిల్లీ అల్లర్లపై చర్చించాలంటూ పట్టుబట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. దీనిపై వెంకయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.