తానెప్పటికీ అన్‌‌‌‌‌‌‌‌లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే యువకుడి కథ ఇది

తానెప్పటికీ అన్‌‌‌‌‌‌‌‌లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే యువకుడి కథ ఇది

‘బిగ్‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌’ షోతో పాపులర్ అయిన సొహైల్‌‌‌‌‌‌‌‌.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో చాన్స్ సంపాదించాడు. వాటిలో ‘లక్కీ లక్ష్మణ్’ ఒకటి. నువ్వు అదృష్టవంతుడివని అందరూ చెబుతున్నా, తానెప్పటికీ అన్‌‌‌‌‌‌‌‌లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే యువకుడి కథ ఇది. ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ‘అదృష్టం హలో అందిరో చందమామ’ అనే లిరికల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ని డైరెక్టర్ శివ నిర్వాణ నిన్న విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘పాట చాలా బాగుంది. సొహైల్ డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. టైటిల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను శివ నిర్వాణ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నాడు సొహైల్. ఇదో కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ అని, త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ని అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.