నాని "దసరా" అప్డేట్: మాస్ లుక్ అదిరింది..!

నాని "దసరా" అప్డేట్: మాస్ లుక్ అదిరింది..!

నాని హీరోగా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న సినిమా "దసరా".  నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది.  ఈ సినిమా కోసం ఇక్కడ ఒక భారీ సెట్ ను వేశారట. మేజర్ పార్టు షూటింగు ఈ సెట్లో జరగనుందని టాక్. ఈ క్రమంలోనే సెట్ లో ఉన్న ఫొటోను షేర్ చేసింది సినిమా యూనిట్. మాస్ లుక్ తో ఉన్న నాని ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరి కాంబినేషన్ సీన్స్ ఇందులో ఉంటాయని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ తో చాలావరకూ షూటింగు పూర్తవుతుందని తెలిపిన టీమ్.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే చెబుతామంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నాని తెలంగాణ ప్రాంతానికి చెందిన మాస్ యువకుడిగా కనిపించనున్నాడట. నానికి జోడీగా కీర్తి సురేశ్ రెండోసారి నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాని-కీర్తి సురేశ్ కలిసి నటించిన 'నేను లోకల్'  హిట్ అయిన విషయం తెలిసిందే.