ఈ వారం 6 ఐపీఓలు.. 10 కంపెనీల లిస్టింగ్స్​

ఈ వారం 6 ఐపీఓలు.. 10 కంపెనీల లిస్టింగ్స్​
  •     రూ.500 కోట్లకుపైగా సేకరించే చాన్స్​

న్యూఢిల్లీ: స్టాక్​ మార్కెట్లు ఈ వారంలో ఐపీఓలతో, లిస్టింగ్స్​తో బిజీబిజీగా ఉండబోతున్నాయి. మొత్తం ఆరు ఐపీఓలు దలాల్​స్ట్రీట్​కు వస్తాయి.  10 కంపెనీల లిస్ట్​ అవుతాయి. మెయిన్‌‌‌‌బోర్డ్ సెగ్మెంట్ నుంచి ఒకటి ఉండగా,  మిగిలినవి ఎస్​ఎంఈ సెగ్మెంట్‌‌‌‌కు చెందినవి. ఈ ఆరు కంపెనీలు రూ. 500 కోట్లకుపైగా సేకరించనున్నాయి.

1. ఢిల్లీకి చెందిన టెక్నాలజీ- ఎనేబుల్డ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్  బీఎల్​ఎస్​ ఈ -సర్వీసెస్ ఐపీఓ జనవరి 30న మొదలవుతుంది. వచ్చే నెల ఒకటో తేదీన ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ. 129–-135.  తాజా ఇష్యూతో కూడిన ఆఫర్ ద్వారా రూ. 310.9 కోట్లను సమీకరించనుంది. 

2. ఇండక్షన్ హీటింగ్,  మెల్టింగ్ ఉత్పత్తుల కంపెనీ మెగాథర్మ్​ తన పబ్లిక్ ఇష్యూను జనవరి 29న ప్రారంభించి, 31న ముగించనుంది. ప్రైస్ ​బ్యాండ్​ను రూ. 100-–108 మధ్య నిర్ణయించారు. కోల్‌‌‌‌కతాకు చెందిన ఈ కంపెనీ 49.92 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ద్వారా రూ.53.91 కోట్లు సేకరిస్తుంది. 

3. పాట్స్​ను,  ప్లాంటర్లను తయారు చేసే మహారాష్ట్ర కంపెనీ హర్షదీప్ హార్టికో తన ఐపీఓను జనవరి 29–-31  మధ్య  సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం తెరవనుంది. 42.42 లక్షల ఈక్విటీ షేర్ల ఫ్రెష్​ ఇష్యూ ద్వారా రూ.19.09 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్​ను ఒక్కో షేరుకు రూ.42-–45 మధ్య నిర్ణయించారు. 

4. మయాంక్ క్యాటిల్ ఫుడ్ ఐపీఓ ఈనెల 29–-31 తేదీల్లో ఉంటుంది. ఇది పశువుల ఆహారం తయారు చేసే గుజరాత్‌‌‌‌కు చెందిన ఆయిల్ కంపెనీ. ఒక్కో షేరు ధర రూ. 108. ఇష్యూ ద్వారా రూ. 19.44 కోట్లను సమీకరించనుంది. 

5. బవేజా స్టూడియోస్ ఐపీఓ కూడా జనవరి 29 –ఫిబ్రవరి ఒకటో తేదీ మధ్య ఉంటుంది. ఈ వారం ప్రారంభమయ్యే పబ్లిక్ ఇష్యూలలో ఇదే అతిపెద్ద ఐపీఓ. ఈ సినీ నిర్మాణ సంస్థ ఐపీఓలో రూ. 72 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది.  రూ. 25.2 కోట్ల విలువైన ఆఫర్ -ఫర్ -సేల్ ఉంటుంది. వీటి ద్వారా రూ. 97.2 కోట్లను సమీకరించనుంది.   ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.170–-180. 

6. గాబ్రియేల్ పెట్ స్ట్రాప్స్ ఐపీఓ ఈ వారం ఐపీఓలలో చివరిది. హెవీ మెటీరియల్స్ ప్యాకేజింగ్ కోసం పట్టీలను తయారు చేసే కంపెనీ ఇది. ఇష్యూ జనవరి 31– ఫిబ్రవరి 2 మధ్యన ఉంటుంది. 

లిస్టింగ్స్​ వివరాలు..

ఫోన్‌‌‌‌ బాక్స్ రిటైల్, డెలాప్లెక్స్,  డాక్‌‌‌‌మోడ్ హెల్త్ టెక్నాలజీస్ అనే మూడు ఐపీఓలు ఈ వారం.. అంటే జనవరి 30న ముగుస్తాయి. అన్నీ జనవరి 25న ఓపెన్​ అయ్యాయి.  రూం ఎయిర్ కండీషనర్ల   తయారీదారు అయిన ఎప్యాక్ డ్యూరబుల్, ఐపీఓ ద్వారా రూ. 640 కోట్లను సేకరించింది. ఇది జనవరి 30న తన ఈక్విటీ షేర్లను లిస్ట్ చేస్తుంది.  సాయిల్ హెల్త్, ప్లాంట్ న్యూట్రిషన్   ఉత్పత్తులను తయారు చేసే నోవా అగ్రిటెక్, జనవరి 31న లిస్టింగ్ అవుతుంది.  ఇది పబ్లిక్ ఆఫర్ ద్వారా దాదాపు రూ. 144 కోట్లను సంపాదించింది. ఇష్యూ 109.37 రెట్లు సబ్‌‌‌‌స్క్రయిబ్ అయ్యింది.   

ఈ వారం జరిగే 10 లిస్టింగ్‌‌‌‌లలో, ఎనిమిది ఎస్​ఎంఈ సెగ్మెంట్ నుంచి ఉంటాయి. క్వాలిటెక్​ ల్యాబ్స్​ జనవరి 29న బీఎస్​ఈ ఎస్​ఎంఈలో లిస్టవుతుంది. యూఫోరియా ఇన్ఫోటెక్​షేర్లు జనవరి 30న బీఎస్​ఈ ఎస్​ఎంఈలో లిస్టవుతాయి. ఎన్​ఎస్​ఈ ఎమర్జ్‌‌‌‌లో కాన్‌‌‌‌స్టెలెక్ ఇంజనీర్స్,  అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ షేర్లు కూడా 30న లిస్ట్ అవుతాయి.  బ్రిస్క్ టెక్నోవిజన్ జనవరి 31న బీఎస్​ఈ ఎస్​ఎంఈలో తన షేర్లను లిస్టింగ్ చేస్తుంది. ఫోన్​బాక్స్​ రిటైల్​, డెలాప్లెక్స్​, డాక్​మోడ్​హెల్త్​ షేర్ల లిస్టింగ్ ఎన్​ఎస్​ఈ ఎమర్జ్‌‌‌‌లో  ఫిబ్రవరి రెండున ఉంటుంది.