ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే

కోవిడ్ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై బాగానే చూపించింది. అనేక సినిమాలు ఆగిపోతే.. పెద్ద పెద్ద సినిమాలు సైతం... వాయిదాపై వాయిదా పడుతూ వచ్చాయి. అనేక వాయిదాల తర్వాత ఇటీవలే  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరి కొన్ని బిగ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్... ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ ఈ వారమే ఫ్యాన్స్ కు కనువిందు చేయనుంది. ఇక సూర్య నటించిన ఈటీ మూవీ కూడా ఈ వీకే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ వారం థియేటర్‌లో, ఓటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఒకసారి చూస్తే...

థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు:
1) ఈటి(ఎవ్వరికీ తలవంచడు) : సూర్య  చిత్రం మార్చి 10న థియేటర్లలో విడుదల కాబోతుంది.

2) రాధే శ్యామ్ : మార్చి 11న విడుదల కాబోతుంది. 

ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాలు

1) ఖిలాడి : రవితేజ- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 11న 

2) మారన్ : ధనుష్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 11న 

3) ఖుబూల్‌ హై : మార్చి 11న ఆహా లో 

4) క్లాప్ : ఆది పినిశెట్టి -  మార్చి 11న సోనీ లివ్ లో

5) రౌడీ బాయ్స్ : ఆశీష్ -   మార్చి 11న జీ5 లో

6) రైడర్‌ : మార్చి 11న జీ5 

7)మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ షమీమ్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 11న జీ5 లో 

8) అవుట్‌ ల్యాండర్‌ (6వ సీజన్‌) : మార్చి 7న నెట్ ఫ్లిక్స్ లో 

9)ద లాస్ట్‌ కింగ్‌డమ్‌(5వ సీజన్) : మార్చి 9న నెట్ ఫ్లిక్స్ లో

10) ద అండీ వార్‌హోల్‌ డైరీస్‌ (వెబ్‌ సిరీస్‌) : మార్చి 9న నెట్ ఫ్లిక్స్ లో

11) ఎ ఆడమ్‌ ప్రాజెక్ట్‌ : మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో 

12)అప్‌లోడ్‌ (2వ సీజన్‌) – మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో