తొలి తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో 2024 ఏప్రిల్ 5న చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం శాంతి స్వరూప్ గుండెపోటుతో యశోదా ఆస్పత్రిలో చేరారు. శాంతి స్వరూప్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శాంతి స్వరూప్ 1983 నవంబర్ 14న దూర దర్శన్ ఛానెల్‌లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. పదేండ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు వినిపించారు. శాంతి స్వరూప్ తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు. శాంతి స్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ముఖ్యంగా దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ కావడం విశేషం. సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఆయనకు పరిచయం ఉంది. శాంతి స్వరూప్ కి సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది.