మళ్లీ సభలోకి ఆ నలుగురు ఎంపీలు

మళ్లీ సభలోకి ఆ నలుగురు ఎంపీలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుని సస్పెండ్ అయిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణిక్కం ఠాగూర్, రమ్యా హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతిమణిపై సస్పెన్షన్​ను లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ఎత్తేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వారం క్రితం వీరిని వర్షాకాల సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేయగా.. అప్పటి నుంచి వీరు పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతున్నారు.

ఇకపై సభలోకి ప్లకార్డులు తీసుకురాబోమని ప్రతిపక్షాలు హామీ ఇవ్వడంతో స్పీకర్ వీరిపై సస్పెన్షన్​ను ఎత్తేశారు. ఇకపై సభలోకి ప్లకార్డులు ఎవరు తెచ్చినా వేటు తప్పదని.. ఇదే ఫైనల్ వార్నింగ్ అని స్పీకర్ హెచ్చరించారు. ఎంపీలపై సస్పెన్షన్​ ఎత్తేయడంతో లోక్​సభలో కార్యకలాపాలు సజావుగా నడిచాయి.