నేరం చేస్తే ఆ పోస్టులకు అర్హులు కారు : హైకోర్టు

నేరం చేస్తే ఆ పోస్టులకు అర్హులు కారు : హైకోర్టు

హైదరాబాద్ వెలుగు: నేర అభియోగాలు ఉన్నవారు అవి నిరూపణ కాకపోయినా.. పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు అనర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. “ఒక వ్యక్తిపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపణలు నిరూపణ కాకపోయినా అది మచ్చే. నిర్దోషి అని తేలినా కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి బాధ్యత గల పోస్టుకు అర్హుడు కాదు. వాళ్లను కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు ఎంపిక చేయరాదనే నిర్ణయం చట్టబద్ధమే” అని జడ్జి జస్టిస్ నవీన్ రావు తీర్పు చెప్పారు.

పాత మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా  రాయకల్లుకు చెందిన కె.కృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2015 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుకు ఎంపికయ్యాడు. ఎంపిక లిస్టులో ఆయన పేరు వచ్చింది.అయితే నారాయణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు అతడి ఎంపికను రద్దు చేసింది. తనపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసును కోర్టు కొట్టేసిందని, తాను దోషిని కాదని, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు ఇవ్వాలన్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించడంతో కృష్ణకుమార్ హైకోర్టును ఆశ్రయించాడు.