కుంభమేళా పొయ్యొచ్చినోళ్లు కరోనాను ప్రసాదంలా పంచుతారేమో!

కుంభమేళా పొయ్యొచ్చినోళ్లు కరోనాను ప్రసాదంలా పంచుతారేమో!

ముంబై: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌‌‌లో మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడ్రోజులుగా రోజుకు 2 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో కుంభమేళాను నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. లక్షలాది మంది గుమిగూడుతున్నందున మేళాను ఎందుకు నిర్వహించారంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ స్పందించారు. కుంభమేళాకు వెళ్లి వచ్చిన భక్తులు అందరికీ ప్రసాదం మాదిరిగా కరోనాను పంచుతారేమోనని ఆమె అన్నారు. కుంభమేళాకు పోయొచ్చిన వారి నుంచి మిగతావారికి కరోనా సోకకుండా ఉండాలంటే వారిని క్వారంటైన్‌లో ఉంచాలని సూచించారు.