మాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున ఫైన్

V6 Velugu Posted on Apr 06, 2021

రాజన్నసిరిసిల్ల జిల్లా: కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడం కలకలం రేపుతున్న నేపధ్యంలో అధికారులు, పోలీసులు నిబంధనలు కఠినంగా అమలుకు శ్రీకారం చుట్టారు. మంగళవారం వేములవాడ పట్టణంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మాస్కులు ధరించకుండా తిరుగుతున్న 13 మందిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించి మాస్క్ ధరించకుండా బయట తిరగడం నిషిద్ధమని చెబుతున్నా వినకపోవడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు పోలీసులు. రెండోసారి పట్టుపడితే జరిమానా మరింత భారీగా ఉంటుందని  హెచ్చరిస్తున్నారు. 

Tagged POLICE, Fine, corona, masks, vemulawada

Latest Videos

Subscribe Now

More News