మేడ్చల్​లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఏమాయె?: తోటకూర వజ్రేశ్​ యాదవ్

మేడ్చల్​లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఏమాయె?: తోటకూర వజ్రేశ్​ యాదవ్

కీసర, వెలుగు: తన కాలేజీలకు అనుమతి తెచ్చుకునే మంత్రి మల్లారెడ్డి.. మేడ్చల్​లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఎందుకు అనుమతి తేలేకపోయారని ఆ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాగారాం మున్సిపాలిటీ రాంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్​కు ఆయన చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. 

ఈ ఎన్నికల్లో జనం బీఆర్ఎస్​ను ఓడించి ఇంటికి పంపుడు ఖాయమన్నారు. తన కాలేజీలకు అడ్మిషన్లు తగ్గుతాయనే ఉద్దేశంతో మల్లారెడ్డి మేడ్చల్​కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీని తీసుకురావట్లేదని వజ్రేశ్ ఆరోపించారు. మల్లారెడ్డిని ఓడించి ఇంటికి పంపాలన్నారు. తనను భారీ మెజా ర్టీతో గెలిపించాలని కోరారు.  

వజ్రేశ్​ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం

తోటకూర వజ్రేశ్​ యాదవ్​ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కాంగ్రెస్  దమ్మాయిగూడ  వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వజ్రేశ్​ యాదవ్​ తరఫున ఇంటింటికి తిరుగుతూ  ఆయన ప్రచారం నిర్వహించారు.