వైభవంగా ఉసరికాయలపల్లి కోటమైసమ్మ జాతర షురూ..

వైభవంగా ఉసరికాయలపల్లి  కోటమైసమ్మ జాతర షురూ..
  • అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు
  • జాతరలో కిక్కిరిసిన భక్త జనం 
  • 150 మంది పోలీసులతో బందోబస్తు

కారేపల్లి, వెలుగు : కొలిచిన వారి కోర్కెలు తీర్చే దేవతగా ప్రసిద్ధి గాంచిన మండలంలోని ఉసరికాయలపల్లి కోటమైసమ్మ జాతర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శక్తి స్వరూపిణి కోటమైసమ్మ తల్లిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు వివిధ  ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఐదు రోజులపాటు రాత్రింబవళ్లు నిర్వహించే జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, దేవాదాయ శాఖ ఈవో వేణుగోపాలచార్యుల నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.

 సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై గోపి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పూజారులు వాహన పూజలు చేపట్టారు. జాతరలో ఏర్పాటు చేసిన వినోద భరిత యంత్రాలతో భక్తజనం సంబరంగా గడిపారు.