తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు

తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు
  • జడ్జిమెంట్లు, ఆదేశాల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం
  • ఎనిమిదేండ్లలో హైకోర్టులో 19 వేల కేసులు.. సగానికి పైగా పెండింగ్
  • సీఎస్ సోమేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే 372 కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కోర్టు తీర్పుల అమలులో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ల్యం ప్రదర్శిస్తోంది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు, ఆదేశాలను చాలామంది ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేదు. న్యాయం కోసం భూనిర్వాసితులు.. ప్రమోషన్లు, పోస్టింగ్ విషయంలో ఉద్యోగులు.. ఇతర కేసుల్లో బాధితులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులను అమలు చేయడం లేదు. దీంతో బాధితులు తీర్పు అమలు కోసం మళ్లీ కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఉంటున్నది. చాలా కేసుల్లో సర్కార్ నిర్లక్ష్యంతో అధికారులు బలవుతుండగా, మరికొన్ని చోట్ల అధికారులే దోషులుగా బోనెక్కుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిదేండ్లలో 19 వేలకు పైగా కోర్టు ధిక్కారణ కేసులు నమోదయ్యాయంటే తీర్పుల అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సగం దాకా కేసులు డిస్పోజ్ కాగా, మరో సగానికి పైగా కేసులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.

90 శాతం ప్రభుత్వ అధికారులే
రాష్ట్ర హైకోర్టులో ఏటా నమోదవుతున్న వేలాది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసుల్లో 90 శాతం కేసుల్లో రెస్పాండెంట్స్ ప్రభుత్వ అధికారులే ఉంటున్నారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనేక సందర్బాల్లో హైకోర్టు సీరియస్ కాగా, నిరుడు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అప్పటి సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా, భూసేకరణ అధికారి శ్రీనివాసులు, ఆర్డీవో జయచంద్రారెడ్డికి జైలు శిక్ష విధించే వరకు వెళ్లింది. వివిధ కేసుల్లో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యే చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎనిమిదేండ్లలో 372 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆయన పని చేస్తున్న సమయంలో నమోదైన కేసులు కూడా ఇందులో ఉన్నాయి. గత ఏడాది 88 కేసులు, గడిచిన ఐదు నెలల్లోనే మరో 38 కేసులు సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నమోదయ్యాయి. వీటిలో కొన్ని తీర్పులను ఆలస్యంగానైనా అమలు చేయడం వల్లో, ఇతర పరిష్కారాలు చూపడం వల్లో 175 కేసులు డిస్పోజ్​ అయ్యాయి. ఇంకా 197 కేసులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఏప్రిల్ 30న ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేలతో నిర్వహించిన స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్సులో సాక్షాత్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. రాష్ట్ర సీఎస్ సోమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

సర్కారు ఒత్తిళ్లకు ఆఫీసర్లు బలి
పంచాయతీ రాజ్, ఎడ్యుకేషన్ శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న సందీప్ సుల్తానియాపై 2021లో 40 కేసులు నమోదు కాగా.. 27 పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 2022లో 77 కేసులు నమోదు కాగా.. 63 పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్లు, సెక్రటరీలు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై కూడా వందల్లో కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో కొందరు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇతర అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోడం, మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పులు పక్కనపెట్టాల్సి వస్తోందని, ఫలితంగా తాము బలికావాల్సి వస్తోందని శిక్షకు గురైన ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐదు నెలల్లో 600 పైనే
కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు వరకు ఇస్తున్న తీర్పులను రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అధికారులు లైట్ తీసుకుంటున్నారు. బాధితులకు న్యాయం చేసేలా కోర్టులు తీర్పులు ఇస్తే.. ప్రభుత్వం వాటిని నిర్ణీత గడువులోగా అమలు చేయడమో లేదంటే పైకోర్టుకు అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లడమో చేయాలి. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర హైకోర్టులో 2014లో 2,289 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు (సీసీ) కేసులు నమోదు కాగా.. 2015లో 2,534 నమోదయ్యాయి. 2016లో 2,651 కేసులు, 2017లో 2,851 , 2018లో 3,509 కేసులు, 2019లో 1,854 కేసులు, 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌020లో 1,188 కేసులు, 2021లో 1,643 కేసులు ఫైలయ్యాయి. గడిచిన ఐదు నెలల్లో 600కుపైగా కేసులు నమోదైనట్లు అంచనా. మొత్తంగా గత ఎనిమిదేండ్లలో 19 వేల కేసులు దాటినట్లు తెలుస్తోంది. వీటిలో 90 శాతం కేసులు ప్రభుత్వ అధికారులపైనే నమోదయ్యాయంటే.. రాష్ట్రంలో కోర్టు తీర్పుల అమలు ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.