ఎల్బీనగర్ సెంటర్లో వేల కోట్ల భూములు కొట్టేశారు : సామ రంగారెడ్డి

ఎల్బీనగర్ సెంటర్లో వేల కోట్ల భూములు కొట్టేశారు : సామ రంగారెడ్డి
  • మంత్రి  కేటీఆర్‌‌‌‌, ఎమ్మెల్యే సుధీర్‌‌‌‌ రెడ్డి భూముల ఆక్రమణదారులు

ఎల్బీనగర్,వెలుగు: ఎల్బీనగర్‌‌ మెయిన్‌‌ సెంటర్‌‌లో ఉన్న వేల కోట్ల రూపాయల 36 ఎకరాల సిరీస్‌‌ భూమిని మంత్రి కేటీఆర్‌‌, ఎమ్మెల్యే సుధీర్‌‌రెడ్డి కలసి స్వాహా చేశారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన ఎల్‌‌బీనగర్‌‌‌‌లోని మాల్ మైసమ్మ దేవాలయం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు..  పేదలకు 60 గజాల స్థలం ఇవ్వడానికి, డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్ల నిర్మాణానికి భూములు లేవని చెబుతారని, కానీ స్వాహా చేయడానికి మాత్రం భూములు దొరుకుతాయా అని ప్రశ్నించారు. 

ప్రభుత్వ భూములు కొల్లగొట్టడానికి ఏజెంట్‌‌గా వ్యవహరిస్తున్నందు వల్లే కేటీఆర్‌‌‌‌కు ఎమ్మెల్యే సుధీర్‌‌‌‌ రెడ్డిపై ప్రేమ ఎక్కువైందన్నారు. సుధీర్‌‌‌‌ రెడ్డి అత్తామామలకు సీఎం రిలీప్ ఫండ్ కింద రూ. 18 లక్షలు తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసమే సుధీర్ రెడ్డి తాపత్రయాపడుతున్నారని ఆరోపించారు. ఎల్‌‌బీనగర్‌‌ అభివృద్ధి కోసం  బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బద్దం ప్రేమ్‌‌మహేశ్వర్‌‌రెడ్డి, నాయికోటి పవన్‌‌కుమార్‌‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.