కేప్‌జెమినిలో కొలువుల వరద..ఈ ఏడాది 30 వేల జాబ్స్

కేప్‌జెమినిలో కొలువుల వరద..ఈ ఏడాది 30 వేల జాబ్స్

ముంబై: ఫ్రెంచ్‌‌ టెక్నాలజీ కంపెనీ ఈ ఏడాది ఇండియాలో కొత్తగా  వేల ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ కంపెనీకి ఇక్కడ ఇప్పటికే  లక్షల మంది ఉద్యోగులున్నారు. కంపెనీ మొత్తం ఉద్యోగులలో సగం మంది ఇండియాలోనే ఉన్నారు. ఫ్రెషర్స్‌‌తోపాటు అనుభవం ఉన్న వాళ్లకీ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కేప్‌‌జెమినీ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ అశ్విన్‌‌ యార్డి చెప్పారు. తమ బిజినెస్‌‌కు ఇండియా చాలా ముఖ్యమైనదని, ఇప్పుడున్న ఉద్యోగులకు కొత్త స్కిల్స్‌‌ను నేర్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌‌ టెక్నాలజీలను వారికి నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులలో 65 శాతం 30 ఏళ్లలోపు  వారే కావడంతో, కొత్త స్కిల్స్‌‌ను ఉత్సాహంగా నేర్చుకుంటున్నారని చెప్పారు. పది, పదిహేనేళ్లు అనుభవమున్న మిడ్‌‌ లెవెల్‌‌ మేనేజర్లకు స్పెషల్‌‌ ప్రోగ్రామ్స్‌‌ను కేప్‌‌జెమినీ నిర్వహిస్తోంది. ఆ తర్వాత వారిని ప్రాజెక్ట్‌‌ మేనేజర్లు, ఆర్కిటెక్ట్స్‌‌గా నియమిస్తోంది. సాధారణ వలస తప్ప ఉద్యోగులనెవరినీ తీసి వేయడం లేదని యార్డి వెల్లడించారు. క్లయింట్ల నుంచి డిమాండ్స్‌‌ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులను వెంటనే ప్రాజెక్టులపై పంపాల్సి వస్తోందని చెబుతూ, ఉద్యోగుల ట్రైనింగ్‌‌, నైపుణ్యం పెంపు వంటి వాటికి ఎక్కువ టైం పడుతోందని తెలిపారు. ప్రాజెక్టు పని చేస్తూనే ఉద్యోగులు తమ స్కిల్స్‌‌ను మెరుగుపరుచుకుంటున్నారని పేర్కొన్నారు.

ముంబై సమీపంలోని ఐరోలి వద్ద ఉన్న డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్లో తగినంత స్థలం ఉందని, ఇది చాలా పెద్ద సెంటరని యార్డీ చెప్పారు. మిగిలిన డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్లలోనూ కొత్త ఉద్యోగులకు సరిపడేంత స్థలం ఉందని స్పష్టం చేశారు. టెక్నాలజీ రంగంలోని ఇతర కంపెనీలు ఉన్న ఉద్యోగులను తీసేస్తుంటే కేప్‌‌జెమినీ కొత్త ఉద్యోగాలు కల్పించడం విశేషం. పోటీదారులు రిసెర్చ్‌‌ అండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌పై ఫోకస్‌‌ పెడుతూ, పేటెంట్లపై కన్నేస్తుంటే కేప్‌‌జెమినీ మాత్రం అప్లైడ్‌‌ ఇనొవేషన్‌‌పైనే దృష్టి నిలుపుతోందని యార్డి చెప్పారు. క్లయింట్లకు అవసరమైన ఇంప్రూవ్‌‌మెంట్స్‌‌పైనే తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు.