ఇంటి కిరాయిలు పెరిగిపోతున్నాయని వేలమంది రోడ్డెక్కారు

ఇంటి కిరాయిలు పెరిగిపోతున్నాయని వేలమంది రోడ్డెక్కారు

ఇళ్ల రెంట్(కిరాయి) భారీగా పెంచేస్తున్నారంటూ జర్మనీ రాజధాని బెర్లిన్ లో వేలమంది నిరసన తెలిపారు.  పెరిగిపోతున్న అద్దె ధరలను కంట్రోల్ చేయాలని నినాదాలు చేస్తూ.. అక్కడి ప్రభుత్వానికి తమ గోడును వినిపిస్తూ.. బెర్లిన్ లో రోడ్డెక్కారు.

గత 10 ఏళ్ల కాలంలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయని, తమ సంపాదనలో సగభాగం రెంట్లకే  సరిపోతుందని ఆవేదనగా చెప్పారు నిరసనకారులు.  ఈ సమస్యకు పరిష్కారంగా  ప్రైవేట్ భూస్వాములకు చెందిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. ఈ సమస్యను గతంలోనే అధికారులు దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు.

2019 సంవత్సరానికి సంబంధించి.. బెర్లిన్ లో ఇంటి కిరాయిలు పెరిగాయని అక్కడి ఓ అధ్యయనం చెబుతోంది. సగటు అద్దె ధర ఒక సంవత్సరం క్రితం కంటే 5 శాతం ఎక్కువ పెరిగిందని అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థ CBRE , బెర్లిన్ హైప్ AG తన సర్వేలో వివరించింది.