ఖమ్మంలో పాలస్తీనాకు మద్దతుగా భారీ ర్యాలీ

 ఖమ్మంలో పాలస్తీనాకు మద్దతుగా భారీ ర్యాలీ

ఖమ్మం టౌన్, వెలుగు: పాలస్తీనాకు మద్దతుగా గురువారం ఖమ్మం సిటీలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్నివర్గాలు  ప్రజలు పాల్గొని సంఘీభావ ర్యాలీ తీశారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ చౌరస్తా వరకు భారీగా తరలివెళ్లారు. పాలస్తీనాలో వేలాదిమంది ప్రజల ఆకలి చావులకు కారణమవుతున్న ఇజ్రాయిల్ అమానుష దాడిని నిరసిస్తూ నినాదాలు చేశారు. 

ర్యాలీలో సీపీఐ జాతీయ నేత అజీజ్ పాషా, జిల్లా కార్యదర్శి దండి సురేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకనేపల్లి వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత మధు, జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, బీఆర్ఎస్ సిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్, కాంగ్రెస్ కిసాన్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, మైనార్టీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, జమాతే ఇస్లామిక్ నేతలు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, పాలస్తీనా సంఘీభావ కమిటీ నేతలు రవి మారుత్ తదితరులు పాల్గొని మాట్లాడారు. వేలాదిమంది విద్యార్థులు, ప్రజలు ప్రజాస్వామికవాదులు, మేధావులు, కవులు, కళాకారులు,ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు వివిధ పాఠశాలల, కళాశాల నుంచి భారీగా తరలివచ్చారు.