కేసీఆర్ ప్రభుత్వం కారణంగానే హైదరాబాద్ కు ముప్పు

కేసీఆర్ ప్రభుత్వం కారణంగానే హైదరాబాద్ కు ముప్పు

వరదలను ప్రకృతి వైపరీత్యం అని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం…తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ అనుచరులు చెరువులను అక్రమించి, లే అవుట్లు చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. దీని ఫలితంగానే హైదరాబాద్ లోని  కాలనీలు వరదమయం అయ్యాయని అన్నారు. 120మంది వరకు వరదల్లో మరణించారని..ఇవన్నీ ప్రభుత్వ హత్యాలేనని స్పష్టం చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ కు ఉపద్రవం వచ్చిందన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ అసమర్థతేనన్నారు. ముంపు బాధితులకు సహయంలో దోపిడీ జరిగిందన్నారు. 5వేలు బాధితుల నుంచి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. వరద సాయం నిధుల్లో 200కోట్లు TRS నేతలు దోచుకున్నారని అన్నారు. ప్రభుత్వం నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అవినీతికి ఆస్కారం ఉండేది కాదని సూచించారు. ఎంపీగా ఉన్న నాకు సాయం పంపిణీ సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు రేవంత్.

ప్రశ్నిస్తే అధికారులు తప్పయ్యిందంటూ క్షమాపణ చెబుతున్నారని తెలిపారు రేవంత్. దోపిడీ పై విజిలెన్స్, ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. TRS నేతల బంధువులకు నగదు పంపిణీ చేశారన్నారు. ఇప్పుడు గ్రేటర్ లో ఓట్ల కొనుగోలుకు సీఎం రిలీఫ్ నిధులను వినియోగిస్తున్నారని చెప్పారు.ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ను కలిసేందుకు వెళ్లిన ఎంపీ రేవంత్ రెడ్డి. జోనల్ కమిషనర్ లేకపోవడంతో డీసీ మారుతిని కలిసి వరద ముంపు ప్రాంతాల వివరాలు ఇచ్చారు. ఆ తర్వాత వరద ముంపు సహాయంలో అవకతవకల పై జోనల్ కమిషనర్ కు ఫోన్ లో మందలించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన లబ్ధిదారుల వివరాలు, ఎంపిక చేసిన అధికారుల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక ఎంపీగా తనకు సాయం పంపిణీ  సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే అధికారులపై కోర్టులో పిటిషన్ వేస్తానని జోనల్ కమిషనర్ ను హెచ్చరించారు రేవంత్ రెడ్డి. వరద సాయం అధికారులే చేయాలని..టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పంపిణీ చేస్తే మహిళలు తిరగబడి కొడతారని హెచ్చరించారు.