రెంటు ఇవ్వకపోగా బెదిరింపులు.. కేసు నమోదు

రెంటు ఇవ్వకపోగా బెదిరింపులు.. కేసు నమోదు

హైదరాబాద్‌ : ఇంట్లో కిరాయికుండే ఓ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంటి యజమాని. సకాలంలో ఇంటి రెంటు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని.. గట్టిగా అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో..నేను పొలిటికల్ లీడర్ నంటూ బెదిరిస్తున్నాడని ఇంటి ఓనర్ పోలీసులకు తెలిపాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

హెచ్‌ఐజీ 3వ ఫేజ్‌లో ఉంటున్న ఎల్లంకి సదాశివరెడ్డి పెంట్‌హౌజ్‌లో మోహన్‌రెడ్డి, భార్య సంధ్యారెడ్డి, కుమార్తెతో కలిసి మార్చి 2019లో నెలకు రూ. 15000 చెల్లించేందుకు ఒప్పుకుని అద్దెకు దిగారు. ఒక్క నెల మాత్రమే అద్దెను చెల్లించారు. ఆ తర్వాత రెంటు డబ్బులు అడిగిన ప్రతీసారి తాను పొలిటికల్‌ లీడర్‌నని, అద్దె ఇవ్వబోనని చెప్పడమే కాక.. బైకు పై పోలీస్‌ స్టిక్కరు అంటించుకుని ఇంటి యజమానిని బెదిరించసాగారు. దీంతో ఇంటి యజమాని కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మోహన్‌రెడ్డి దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.