హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టుకు నియమితులైన ముగ్గురు అదనపు జడ్జీలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అడ్వకేట్స్ కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి, లా ఆఫీసర్ల కోటా నుంచి సుజన కళాసికం (హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్) అదనపు జడ్జీలుగా నియమితులయ్యారు. వాళ్లతో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే హైకోర్టు ఫస్ట్ కోర్టు హాల్లో ప్రమాణం చేయించారు. హైకోర్టు జడ్జీల మొత్తం సంఖ్య 34కాగా..కొత్త వారితో కలిపి ఆ సంఖ్య ప్రస్తుతం 30కి చేరింది.