భారత్‌లో కరోనా మరణాలు చూసి.. చలించిన ముగ్గురు అమెరికన్ చిన్నారులు

భారత్‌లో కరోనా మరణాలు చూసి.. చలించిన ముగ్గురు అమెరికన్ చిన్నారులు
  • చేతనైన సాయం కోసం తెలిసినోళ్లు, తెలియనోళ్లందరికీ రిక్వెస్టులు
  • 2 కోట్లు పోగు చేశారు
  • ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు కొని ఢిల్లీకి పంపుతున్నారు
  • వాడుకున్నోళ్లు తిరిగివ్వాలని సూచన

వాషింగ్టన్: మన దేశంలో కరోనా మరణాలను చూసి ముగ్గురు అమెరికన్​ చిన్నారులు చలించిపోయారు. తమ వల్ల అయిన సాయం చేయాలని ఫండ్స్​ కలెక్ట్​ చేయడం మొదలెట్టారు. మన దేశ మూలాలున్న ముగ్గురు చిన్నారులు జియా, కరీనా, ఆర్మన్​ గుప్తా ఒకేతల్లి కడుపున, ఒకేసారి పుట్టారు. వయసు పదిహేనేళ్లు. ఇప్పటికే ‘లిటిల్​ మెంటార్స్’ ​ పేరుతో ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఇండియాలోని కరోనా పేషెంట్లకు సాయం చేయాలంటూ వారు తమ ఫ్రెండ్స్​ను, తెలిసినోళ్లను, తెలవనోళ్లను అందరినీ రిక్వెస్ట్ చేశారు. వాళ్లిచ్చిన డాలర్లను పోగేస్తే మొత్తం 2 లక్షల 80 వేల డాలర్లు జమైనయ్.. అంటే మన రూపాయల్లో 2 కోట్ల పైమాటే! ఈ డబ్బుతో ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు వంటి కరోనా పేషెంట్లకు అవసరమయ్యే మెషిన్లను కొన్నరు. వాటిని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ఏరియాల్లోని కరోనా పేషెంట్లకు పంపిస్తరట. ఈ మెషిన్లను అందుకున్నోళ్లకు వారు ఓ రిక్వెస్ట్​ కూడా చేస్తున్నారు.. మీ అవసరం తీరినంక వాటిని తిరిగివ్వండి. మరొకరికి అవి ఉపయోగపడతయి అంటున్నారు.