హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 16న ఉదయం పిల్లర్ నెంబర్ 112 దగ్గర ఒకదానికొకటి వరుసగా మూడు కార్లు ఢీ కొన్నాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ ఘటలో కార్లలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు.
ఉదయం పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి తొలగిస్తున్నారు. పొగమంచు ఉన్నపుడు వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.
►ALSO READ | హైవేపై హర్రర్:8 బస్సులు..3 కార్లు ఢీకొని.. బస్సులు కాలిపోయాయి.. నలుగురు సజీవ దహనం
