ఢిల్లీ హైవేపై టెర్రర్.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం..వరుసగా ఒకదానికొకటి ఢీకొన్న బస్సులు, కార్లు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ప్రాణభయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు.. కేకలు.. ఏడుపులు.. కొంతమంది ప్రయాణికులు లోపల చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా.. మరికొందమంది వాహనాలనుంచి దూకి బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. పొల్యూషన్ ఎఫెక్ట్ తో మంగళవారం తెల్లవారు జామున ఢిల్లీ, ఆగ్రా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు ప్రయాణికులు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
మంగళవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మధుర సమీపంలోని భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా ఆరు బస్సులు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు.
ఆగ్రా నుంచి నోయిడాకు వెళ్తు్న్న వాహనాలు గుంతలో పడటంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నలుగురు మంటల్లో సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P
— ANI (@ANI) December 16, 2025
