
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంతమాగుళూరు మండలం కొప్పరంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు విద్యార్ధులు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గ్రామంలోని వైసీపీ దిమ్మె దగ్గర షేక్ పఠాన్, షేక్ హసన్, పఠాన్ అమర్ అనే విద్యార్ధులు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది . విద్యుత్ తీగలకు జెండా రాడ్ తగలడంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. ముగ్గురు చిన్నారులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.