మేడారంలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు సేఫ్

మేడారంలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు సేఫ్

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు తప్పిపోగా, వారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. స్టేషన్​ ఘన్​పూర్ కు చెందిన ఒక కుటుంబం శుక్రవారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దీక్షిత, సేతన్, బేక్షిత్ అనే ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రుల నుంచి విడిపోయారు. 

పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో మేడారం పోలీస్ స్టేషన్​కు చేరుకొని ఎస్సై కమలాకర్ ను ఆశ్రయించారు. వెంటనే ఎస్సై సిబ్బందితో కలిసి జాతర పరిసరాల్లో గాలించారు. మైక్ అనౌన్స్​మెంట్ ఇప్పిస్తూ కంట్రోల్  రూమ్ కు సమాచారం అందించారు. 

జంపన్న వాగు వద్ద ఏడుస్తూ కనిపించిన ముగ్గురు చిన్నారులను గుర్తించి చాక్లెట్లు ఇచ్చి స్టేషన్ కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.