గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు కార్పొరేషన్లు పక్కా.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు కార్పొరేషన్లు పక్కా.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి
  •     ఫిబ్రవరి 10 తర్వాత కార్పొరేషన్లు ఏర్పడే అవకాశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఈ సమావేశాల్లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి సభలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. అయితే, జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండగా, ఆ వెంటనే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం 300 వార్డులతో 2,053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న జీహెచ్ఎంసీని.. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. 150 వార్డులతో జీహెచ్ఎంసీని శంషాబాద్ వరకు విస్తరించే దిశగా పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. 

పట్టణ, స్థానిక సంస్థల విలీనం తర్వాత 12 జోన్లు, 60 సర్కిళ్లతో ఏర్పడిన జీహెచ్ఎంసీని 150 వార్డులతో ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్ ఆరు జోన్లతో ఏర్పాటు చేయనున్నారు. అలాగే, గ్రేటర్ సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి జోన్లను కలిపి సుమారు 76 వార్డులతో, గ్రేటర్ మల్కాజిగిరిని మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 74 వార్డులతో కలిపి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

వారే కమిషనర్లు? 

జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జి.సృజన, వినయ్ కృష్ణారెడ్డిని గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరిలో సృజన కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లలో కార్యకలాపాలను అడిషనల్​కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే, జోనల్ కమిషనర్లకు, కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 

వినయ్ కృష్ణారెడ్డి మల్కాజిగిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లలో కార్యకలాపాలను మానిటరింగ్ చేస్తూ అదనపు కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిసున్నారు. ఫిబ్రవరి 10 తర్వాత ఖరారు కానున్న మూడు కార్పొరేషన్లలో సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు వీరిద్దరు కమిషనర్లుగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆర్వీ కర్ణన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.