
రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు పడుతాయని హెచ్చరించారు. ఇవాళ, రేపు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు కురవనున్నాయన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో వర్షాలు పడుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.