కూకట్పల్లి, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. మూసాపేట పరిధిలోని రెయిన్బోవిస్టాలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న బీహార్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్, నీరల్కుమార్, చందన్‌కుమార్‌తో కలిసి కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నారు.
బుధవారం పోలీసులు అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి పో లీసులు కిలో డ్రై గంజాయి, ఒక కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
